భారతదేశంలో 85 శాతానికి పైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడతారని తాజా సర్వేలో వెల్లడైంది.

ఎక్కువ శాతం జనాలు చికెన్, మటన్, చేపలు తినేందుకు ఇష్టపడుతున్నారు.

అధ్యయనం ప్రకారం.. అత్యధిక మాంసాన్ని వినియోగించే రాష్ట్రం నాగాలాండ్.  99.8 శాతం మంది ప్రజలు నాన్ వెజ్ తింటారు.

పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 99.3 శాతం మంది నాన్ వెజ్ తింటారు.

 కేరళ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ మాంసాహారులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. కేరళలో 99.1 శాతం మంది మాంసాహారాలు.  

 తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర నాలుగో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 98.25 శాతం మంది మాంసం తింటారు.

తమిళనాడు ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ 97.65 శాతం మంది నాన్ వెజ్ తింటారు.

ముఖ్యంగా తమిళనాడులో చికెన్ బిర్యానీ తినే వారి సంఖ్య తమిళనాడులో ఎక్కువ.

అలాగే ఒడిశా రాష్ట్రం ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 97.35 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు.