వేర్వేరు జాతులు లేదా ఒకే జాతిలోని ఉపజాతులలో ఉన్న ప్రాణుల మధ్య సంతానోత్పత్తి జరిగినప్పుడు ఈ సంకర జంతువులు జన్మిస్తాయి.
కొన్ని సహజంగా పెరిగేటేవి ఉంటే.. మరికొన్ని మనుషులు పెంచడం ద్వారా సంతానోత్పత్తి సృష్టించవచ్చు.
టైగాన్.. మగపులి, ఆడసింహం మధ్య సంతానోత్పత్తి జరిగి ఏర్పడిన సంకర జంతువు టైగాన్.
లైగర్లు.. మగ సింహం, ఆడపులి మధ్య సంతానోత్పత్తి జరిగి ఏర్పడిన సంకర జంతువు లైగర్.. ఇవి వాటి తల్లిదండ్రుల కంటే పెద్దవిగా ఉంటాయి.
బీఫాలో.. ఇది పాలు ఇచ్చే జంతువు. ఆవు మరియు అమెరికన్ బైసన్ కు పుట్టిన సంకర జంతువు.
కామా.. ఒంటే మరియు లామా మధ్య జరిగిన సంతానోత్పత్తి ద్వారా ఈ జంతువు ఏర్పడుతుంది.
జోర్స్.. మగ జీబ్రా మరియు ఆడ గుర్రం మధ్య జరిగిన సంతానోత్పత్తి ద్వారా ఇది పుడుతుంది. ఇది అనేక వ్యాధులకు తట్టుకునేలా తయారు చేశారు.