మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది.

పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే అని నమ్మకం.

మార్గశిర మాసంలో పౌర్ణమి ఘడియలు అంటే డిసెంబర్‌ 7 ఉదయం 8.01 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9.37 గంటల వరకు ఉన్నాయి.

ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు.

దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ కోరల పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది.

ఈ రోజు యమధర్మరాజును పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఇక కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతోంది కాబట్టి, ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు.

Korala Punnami special