నేటితరంకు కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మహిళలకు అవి ఎక్కువ.
ఇక కిడ్నీ సమస్య అనేది పురుషుల్లో కంటే మహిళలనే ఎక్కువగా కనిపిస్తుంది.
మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనబడటానికి కారణం ఏంటి? దాని లక్షణాలు ఏంటి? సమస్య ఎందుకు వస్తుంది? పూర్తి వివరాలు మీకోసం.
మహిళల్లో ఎక్కువగా వచ్చే సమస్య క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ సమస్య వచ్చినా ఎక్కువ రోజుల వరకు తెలియదు.
కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు. అలసట, బలహీనమైన అనుభూతి, వికారం, వాంతులు, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, జలదరింపు, బరువు తగ్గడం లక్షణాలు
అంతేకాదు.. పాదాల వద్ద వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రంలో రక్తం, నిద్రలేమి, చర్మం దురద, కళ్ల చుట్టూ వాపు వంటివి కిడ్నీలక్షణాలు.
దీనికి కారణం తక్కువ నీరు తాగడం, షుగర్ లెవెల్స్ను సరిగ్గా ఉంచుకోకపోవటం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య వస్తుందని అధ్యయనాలు చెప్పాయి.
వీటితో పాటు ఊబకాయం, మధుమేహం, ఎక్కువసేపు మూత్రవిసర్జన, అధిక రక్తపోటు, అధికంగా ధూమపానం, మద్యం సేవించడం వల్ల కొంతమందికి కిడ్నీ సమస్యలు వస్తాయి.
ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ధూమపానం, మద్యం సేవించడం మానివేయాలి. ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.
నొప్పి నుంచి బయటపడేందుకు పెయిన్ కిల్లర్స్ వాడటం తగ్గించండి. తగినంత నీరు తీసుకోవాలి.
రోజూ 7-8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అధిక బరువు ఉన్నట్లయితే తగ్గడానికి తప్పకుండా వ్యాయామం తప్పక చేయాల్సి ఉంటుంది.