భర్తలు భార్యలను టీ అడిగితే సమాధానం చెప్పడంలో అప్పటికి ఇప్పటికి ఎంతగా అప్‌డేట్‌ అయ్యారో చూడండి.

1960లో భర్త : అడక్కముందే భార్య : అప్పటికే చేతిలో టీ కప్పుతో ప్రత్యక్షం.

1970 - భర్త : టీ..? భార్య : తక్షణం తెస్తున్నానండీ

1980 - భర్త : టీ..? భార్య : అయ్యో తెస్తున్నానండీ

1990 - భర్త: టీ..? భార్య : తెస్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి.

2000 - భర్త: టీ..? భార్య : తెస్తాను. ఈ సీరియల్లో బ్రేక్ రానివ్వండి.

2010 భర్త: టీ..? భార్య : ఊరికే రచ్చ చేయకండి. నేను ఖాళీగా ఉన్నప్పుడు తెస్తాను. లేకపోతే మీరే చేసుకోని తాగండి.

ప్రస్తుతం- భర్త : టీ..? భార్య : ఏమిటీ అంటున్నారూ?

భర్త : నేను టీ పెట్టడానికి వెళ్తున్నాను. నీక్కూడా టీ కావాలా?  అప్‌డేట్‌ అంటే ఇదేనా..!