రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా హీరోహిన్ చార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

లైగర్ సినిమాలో హీరోయిన్ అనన్య పాండేకి బదులుగా ముందుగా జాన్వి కపూర్ ని అనుకున్నారట.

ఓమీడియా ఇంటర్వూలో ఇదే విషయాన్ని  పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.  కానీ కొన్ని కారణాల వల్ల హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ పాత్ర చేయలేక పోయిందని తెలిపాడు.

అందువల్ల లైగర్ సినిమాలో జాన్వీ కపూర్ నీ తీసుకోవాలనుకున్నాము. కానీ జాన్వి కపూర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె సినిమాలో నటించలేకపోయింది.

నిర్మాత కరణ్ జోహార్ ఈ కథను విన్న తర్వాత బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరును సూచించడంతో ఆమెను ఎంపిక చేసుకున్నాం అని తెలిపాడు పూరి జగన్నాథ్.

లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో 25న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ అభిమానులు, చిత్ర బృందం, బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.