చాలా మందికి టీ లేకుంటే రోజు గడవదు. కొందరైతే రోజుకు రెండు మూడు సార్లు టీ తాగుతారు. ఏ ఆఫీసులో చూసినా, ఏ అడ్డాలో చూసినా టీ ఉండాల్సిందే.

అయితే ఇటీవల చాలామంది టీతో పాటుగా స్నాక్స్‌ తీసుకుంటున్నారు. ఇష్టమొచ్చిన రీతిలో ఏదిపడితే అది తింటున్నారు. ఇది సరైన పద్దతి కాదు. కొన్ని ఆహారాలు టీతో కలిపి తింటే విషంగా మారే అవకాశం ఉంది. 

 చాలా మందికి టీ లేకుంటే రోజు గడవదు. కొందరైతే రోజుకు రెండు మూడు సార్లు టీ తాగుతారు. ఏ ఆఫీసులో చూసినా, ఏ అడ్డాలో చూసినా టీ ఉండాల్సిందే.

టీ తాగిన వెంటనే చల్లటి నీరు తాగడం హానికరం. అంతే కాదు టీ తాగిన తర్వాత ఐస్ క్రీం తినకూడదు. టీ తాగిన గంట తర్వాత కావాలంటే మీరు చల్లటి పదార్థాలు తినవచ్చు. 

ఉడికించిన గుడ్డు ఉడకబెట్టిన గుడ్లను టీతో పాటు తినకూడదని చాలా తక్కువ మందికి తెలుసు. గుడ్డు ప్రోటీన్‌కి మంచి మూలం. టీతో కలిపి తీసుకుంటే అది మీకు హానికరం. అందుకే దీనికి దూరంగా ఉండటం మంచిది.

 మీకు టీ తాగడం అంటే ఇష్టమైతే పసుపు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినవద్దు. పసుపు, టీ కలిస్తే రసాయన ప్రతిచర్య ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

 పుల్లటి పదార్థాలు టీ కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. మీరు స్నాక్స్ తీసుకుంటే అందులో నిమ్మకాయ లేదా పుల్లని ఆహారాలను కలిపి తీసుకోవద్దు.