చలికాలంలో దగ్గు, జలుబు చాలా సాధారణం.
కానీ కొన్నిసార్లు దగ్గు, జలుబు తర్వాత వాయిస్ బొంగురుగా మారుతుంది. దీన్ని తగ్గించాలంటే ఇవి ట్రై చేయండి..
తాజా అల్లం రసం తీసి అందులో తేనె మిక్స్ చేసి రోజుకు 2-3 సార్లు తాగండి.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వాయిస్ ను సరళం చేస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపండి.. రోజుకు 2-3 సార్లు పుక్కిలించాలి.
ఇది గొంతు వాపును తగ్గిస్తుంది. గొంతును శుభ్రంగా ఉంచుతుంది.
అర టీస్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రించే ముందు తాగాలి.
పసుపులో ఉండే యాంటీసెప్టిక్, హీలింగ్ గుణాలు గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి, మీ తలను టవల్‌తో కప్పి, 5-10 నిమిషాలు ఆవిరి పట్టండి.
ఆవిరి గొంతు మంటను తగ్గిస్తుంది. గొంతుకు సాఫీగా తెరవడంలో సహాయపడుతుంది.
8-10 తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి..తేనె-నిమ్మరసం వేసి టీ లాగా త్రాగాలి.