ఒకప్పుడు పిల్లలకు కాటన్‌ బట్టలతో తయారు చేసిన గోచీలను డైపర్లుగా ఉపయోగించే వారు..

ప్రస్తుతం పిల్లలకు డైపర్లు వేస్తున్నారు తల్లిదండ్రులు..

శిశువు పుట్టినప్పటి నుంచి నాలుగైదేండ్లు వచ్చే వరకు డైపర్లు వాడుతున్నారు..

డైపర్లు వాడకం, నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పిల్లలకు సమస్యలు వస్తాయని వెల్లడి

ఎక్కువగా డైపర్లను వాడితే.. పిల్లలకు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం: శిశు వైద్య నిపుణులు

వస్త్రంతో చేసిన డైపర్లలో వాటర్‌ప్రూఫ్‌ రకం ఎంచుకుంటే మంచిది..

ఈ వాటర్‌ప్రూఫ్‌ డైపర్లను వేడి నీటితో శుభ్రం చేయడం మంచిది: వైద్య నిపుణులు

డైపర్‌ను తొడగడానికి ముందు పిల్లల గజ్జల్లో టాల్కమ్‌ పౌడర్‌ వేయడం మంచిది..

బయటికి వెళ్లినప్పుడు మాత్రమే డైపర్లను ఉపయోగించండి: శిశు వైద్య నిపుణులు