సీనియర్ నటుడు నరేష్ తో ఎఫైర్ పెట్టుకున్న దగ్గరనుంచి పవిత్రా నరేష్ పేరు మారు మ్రోగిపోతుంది

దీంతో ఆమె ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చింది..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ అభిమానులు తెగ ఆరాతీస్తున్నారు

పవిత్రది కర్నాటక.. ఆమె తండ్రి మైసూర్ లోకేష్ కూడా నటుడే..

తండ్రి చనిపోవడంతో సినిమాల్లోనూ నటిస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది పవిత్రా

పవిత్ర లోకేష్‌ 16ఏళ్ల వయసులో కన్నడలో టీవీ నటిగా కెరీర్‌ని ప్రారంభించింది

1994లో అంబరీష్‌ హీరోగా రూపొందిన `మిస్టర్ అభిషేక్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది

హైట్ తగ్గ పర్సనాలిటీ లేదని ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది

ఇప్పటి వరకు 150కిపైగా సినిమాలు చేసిన పవిత్ర`నాయి నేరాలు` అనే సినిమాకు కర్నాటక స్టేట్‌ అవార్డు కూడా అందుకుంది

పవిత్ర భర్త సుచీంద్ర ప్రసాద్ కూడా నటుడే.. అప్పటికే పవిత్రకు మొదటి భర్తతో విడాకులు కూడా అయ్యాయట

ఇక సమ్మోహనం సినిమాలో నరేష్ కు జంటగా నటించింది. అప్పటినుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడింది

చాలా తెలుగు సినిమాల్లో నరేష్- పవిత్రా జంటగా నటించారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది

కొన్నేళ్ల నుంచి లివింగ్ లో ఉన్న ఈ జంట మరికొన్నిరోజులో వివాహం చేసుకోబోతున్నారు. మరి వీరి  బంధం ఎప్పటివరకు ఉంటుందో చూడాలి