అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఆధునిక నర్సింగ్ స్థాపకురాలిగా పరిగణించబడే ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని సూచిస్తుంది.

ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సుల సహకారాన్ని హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఈ ఏడాది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం  థీమ్ “మన నర్సులు, మన భవిష్యత్తు”. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సుల ప్రకారం, “Our Nurses, Our Future” అనేది గ్లోబల్ క్యాంపెయిన్. 

1974లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది.

ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక బ్రిటీష్ నర్సు, ఆధునిక నర్సింగ్‌కు పునాది వేసిన ఘనత పొందిన సంఘ సంస్కర్త. ఆమెను ప్రపంచవ్యాప్తంగా "లేడీ విత్ ది ల్యాంప్" అని పిలుస్తారు. 

1853- 1856 మధ్య జరిగిన క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం శ్రమించి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈ బిరుదును పొందింది.

1854లో జరిగిన యుద్ధంలో గాయపడిన బ్రిటీష్ దళాలకు చికిత్స చేయడానికి  38 మంది మహిళలతో పాటు ఫ్లోరెన్స్ నైటింగేల్ స్కుటారి బారక్ ఆసుపత్రికి చేరుకుంది. 

 ఫ్లోరెన్స్ నైటింగేల్ తన చేతిలో దీపంతో రాత్రిపూట కూడా పనిచేసింది. దాని కారణంగా ఆమెకు "లేడీ విత్ ది ల్యాంప్" అనే బిరుదు వచ్చింది.

ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆగస్టు 13, 1910న 90 ఏళ్ల వయసులో మరణించింది.