ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

2008లో అండర్-19 వరల్డ్‌కప్‌ను భారత్ గెలిచిన తర్వాత కోహ్లీకి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే ఛాన్స్ దొరికింది

ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆకట్టుకోవడంతో.. ఆగస్టు 2008లో శ్రీలంక పర్యటన కోసం టీమిండియాలో ఎంపికయ్యాడు

తన డెబ్యూ మ్యాచ్‌లో కోహ్లీ 22 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు

తన 14 ఏళ్ల కెరీర్‌లో కోహ్లీ మూడు ఫార్మాట్స్‌లో కలిపి 23,726 పరుగులు చేశాడు. దీంతో, 14 ఏళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు

ఇప్పటివరకు 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. గత 14 ఏళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు

తన అంతర్జాతీయ కెరీర్‌లో 57 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచి.. 14 ఏళ్లలో ఆ ఫీట్ నమోదు చేసిన ఏకైకా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు

అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువసార్లు (7) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అందుకుంది కూడా కోహ్లీనే

వన్డేల్లో వేగంగా 12 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. 242 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు

క్రీడా రంగానికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం కోహ్లీని అర్జున (2013), పద్మీ శ్రీ (2017), మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న (2018) అవార్డులతో సత్కరించింది