ఉసిరి రసాన్ని పరగడుపున తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరిలో ఉండే విటమిన్ సి తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతుంది.
కొవ్వును కరిగించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్స్.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉసిరిలో ఉండే ఖనిజాలు.. మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తాయి.
ఉసిరి రసం తాగితే.. హానికరమైన టాక్సిన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గుతాయి.
ఉసిరి.. హెయిర్ ఫోలికల్స్‌ను బలోపేతం చేసి, జుట్టు ఒత్తుగా పెరిగేలా తోడ్పడుతుంది.
షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఒక ఉసిరి తింటే.. షుగర్ నియంత్రణలో ఉంటుంది.
ఉసిరిలో ఉండే విటమిన్ సీ.. కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది.
రోజూ ఒక ఉసిరికాయ తింటే.. బీపీ తగ్గుతుంది, అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.