సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు శివరామకృష్ణమూర్తి.

వీరరాఘవయ్య, నాగరరత్నమ్మల నలుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు.

సినిమాల్లోకి అరగ్రేటం చేసిన తర్వాత దర్శకుడు ఆదుర్తి ఆయన పేరును కృష్ణగా మార్చారు.

నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ రాణించారు. మొత్తం 16 సినిమాలకు కృష్ణ దర్శకత్వం వహించారు.

1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకోగా.. 1976లో కేంద్ర కార్మికశాఖ నటశేఖర్ అనే బిరుదుతో ఆయనను సత్కరించింది.

1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సౌఫల్య పురస్కారం కృష్ణకు దక్కింది.

నటుడు, దర్శకుడు, నిర్మాతగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూగా కృష్ణ సేవలు అందించారు.

1972 జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించిన కృష్ణ.. 

1984లో రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 

రాజీవ్‌గాంధీ మరణంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా కృష్ణకు మంచి సంబంధాలు ఉన్నాయి.