సౌరవ్యవస్థలో రెండో అతిపెద్ద గ్రహం శని.

భూమితో పోలిస్తే దాదాపుగా 760 రెట్లు పెద్దదిగా ఉంటుంది.

శనిగ్రహం హైడ్రోజన్, హీలియంతో కూడిన  ఓ వాయుగోళం. 

శనిగ్రహానికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇందులో టైటాన్ భూమిలాగే వాతావరణాన్ని కలిగి ఉంది. 

అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం. శని గ్రహం పట్టేంత సముద్రంలో దాన్ని ఉంచితే తేలుతుంది.

శని దగ్గర నుంచి చూస్తే భూమి ఇలా ఉంటుంది.

శనిగ్రహాం గురించిన చాలా వివరాలను కాస్సిని–హ్యూజెన్స్ స్పేస్ క్రాఫ్ట్ పంపింది.

శనికి ఉండే వలయాలు 1,20,700 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి.

శని గ్రహం ప్రతి 10.5 గంటలకు ఒకసారి తనచుట్టూ తాను తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగేందుకు 29 ఏళ్లు పడుతుంది.