శ్రీకృష్ణుడు గురించి అద్భుతమైన సమాచారం

శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)

శ్రీకృష్ణుడి జన్మస్థలం మధుర

శ్రీకృష్ణుడు జన్మించిన మాసం-శ్రావణం.. తిథి-అష్టమి, నక్షత్రం- రోహిణి, వారం- బుధవారం

 శ్రీకృష్ణుడి 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రం జరిగిన 36 ఏళ్ల తరువాత నిర్యాణం చోటుచేసుకుంది

శ్రీకృష్ణుడిని మధురలో కన్నయ్యగా.. ఒడిశాలో జగన్నాథుడిగా.. మహారాష్ట్రలో విఠలుడిగా.. రాజస్తాన్‌లో శ్రీనాధుడిగా.. గుజరాత్‌లో ద్వారకాదీసుడు, రాంచ్చోడ్‌గా.. ఉడిపి, కర్ణాటకలో కృష్ణగా పిలుస్తుంటారు.

జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు  జన్మనిచ్చిన తల్లి దేవకీ పెంచిన తండ్రి నందుడు పెంచిన తల్లి యశోద

శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చాడు.  చాణుర - కుస్తీదారు కంసుడు - మేనమామ శిశుపాలుడు, దంతవక్ర - అత్త కొడుకులు

కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వల్ల.. 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారాడు.