కనురెప్పలను నిమిషానికి 20 సార్లు.. ఏడాదికి 10 లక్షల సార్లు మూస్తూ తెరుస్తుంటాం.
మన శరీరంలో అలసిపోని ఏకైక కండరం గుండె.
ప్రతి నిమిషం మన శరీరం 30,000 పైగా మృత చర్మ కణాలను తొలగిస్తుంది.
ప్రతీ వ్యక్తి జీవిత కాలంలో సగటున గుండె 3 బిలియన్ల కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది.
మానవుడి రక్త నాళాలతో భూమధ్య రేఖను నాలుగు సార్లు చుట్టొచ్చు
మెదడు నరాల ద్వారా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో సమాచారం వెళ్తుంది.
మానవ ముక్కు ట్రిలియన్ విభిన్న సువాసనలను గుర్తించగలదు.
మానవుడి ఎముకలు స్టీల్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. అగ్గిపెట్టె సైజ్ ఉంటే ఎముక 8164 కిలోలను మోయగలదు.
జీర్ణాశయంలోని ఆమ్లాలు ఖనిజాలను కూడా కరిగించగలవు. చర్మాన్ని కాల్చేంత పవర్ ఉంటుంది.