తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ (43 ఏళ్లు)

కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు ప్రభాస్ జన్మించాడు

ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు

ప్రభాస్‌కు ఒక అన్నయ్య, ఒక అక్క ఉన్నారు. అన్నయ్య పేరు ప్రభోధ్.. అక్క పేరు ప్రగతి.

భీమవరంలోని డీఎన్ఆర్ స్కూలులో ప్రభాస్ చదువుకున్నాడు

హైదరాబాద్‌లోని నలంద కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు

ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్.. ఈ మూవీ 2002లో విడుదలైంది

ప్రభాస్ తన కెరీర్‌లో ఎక్కువ రోజులు షూటింగ్‌కు కేటాయించిన సినిమా బాహుబలి. ఈ మూవీ కోసం ఐదేళ్లు కేటాయించాడు

ప్రభాస్‌ భోజన ప్రియుడు. అతడికి చికెన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టం

మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీఇడియట్స్ సినిమాలను ప్రభాస్ 20 సార్లకు పైగా చూశాడు