హీరో దుల్కన్ సల్మాన్ గురించి మీకు తెలియని విషయాలు

సీతారామం సినిమాతో ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్ మలయాళం హీరో

మలయాళంలో స్టార్ హీరో మమ్ముట్టి తనయుడే దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ జూలై 28, 1986లో జన్మించాడు.

2011 డిసెంబర్ 22న చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియాను వివాహం చేసుకున్నాడు. ఓ పాప కూడా ఉంది.

2012లో సెకండ్ షో అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేశాడు.

దుల్కర్ నటించిన రెండో సినిమా 'ఉస్తాద్ హోటల్'కు ఉత్తమ వినోద చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. 

ఓకే బంగారం, మహానటి, కనులు కనులు దోచాయంటే వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు

2013, 2014లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా కొచ్చి టైమ్స్ పత్రికకు ఎంపికయ్యాడు.

మహానటి తర్వాత తెలుగులో దుల్కర్ నేరుగా నటించిన మూవీ సీతారామం