భారత దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి

కరోనా కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొనే వెసులుబాటు ఇచ్చిన సంగతి తెల్సిందే

తాజాగా ఇన్ఫోసిస్ ఉద్యోగులకు యాజమాన్యం కీలక ఆదేశాలు జారీచేసింది

నో మూన్ లైటింగ్, నో టూ టైమింగ్ విధానాలను వ్యతిరేకిస్తూ ఈమెయిల్ పంపింది

మూన్ లైటింగ్ అంటే ఉద్యోగులు ప్రాథమికంగా చేసే ఉద్యోగంతో పాటు పనివేళలు పూర్తయ్యాక మరో ఉద్యోగం చేయకూడదు

మూన్ లైటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ నోటీసులు పంపింది

తమ మాట వినని యెడల ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ను ఉల్లంఘించినట్టుగా భావించి ఉద్యోగిపై చర్యలు తీసుకోనున్నట్లు కూడా తెలిపింది

ఒక పని చేస్తూ  ఖాళీ సమయంలో మరొక పని చేస్తే ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుందని చెప్పుకొచ్చింది