హిందూ మత విశ్వాసాల ప్రకారం, కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు.. కార్తీక సోమవారం విశిష్టతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ఏడాది కార్తీక మాసం మొదటి సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం ఆచరించడం మంచిదని శాస్త్ర వచనం.

కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోళా శంకరుడిని పూజిస్తే దీర్ఘసుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు.

కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి.  ఇలా చేయడం వల్ల కైలాస దర్శనభాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది.

సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. సోమ అనే పదంలో సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెబుతారు.

కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యా వేళలో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి. అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి.

కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని ఉవాచ. అందుకే రేపు కోటి సోమవారం కనుక ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోండి.

కార్తీక సోమవారం: సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాయలయాని వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి.