రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటున్నారా? కాస్త జాగ్రత్త.
ఇలాంటివారిలో శరీర బరువు, ఎత్తు నిష్పత్తి (బీఎంఐ), నడుం చుట్టుకొలత అధికంగా ఉంటోందట.
నిద్రకూ మధుమేహానికీ సంబంధం ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ వెల్లడైంది.
త్వరగా పడుకునేవారితో పోలిస్తే వీరికి మధుమేహం వచ్చే అవకాశం 50% ఎక్కువని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.
వేళాపాళా లేని భోజనం, అనారోగ్యకర తిండి తినటం వంటి ఇతరత్రా జీవనశైలి అంశాలతో సమస్యలు పెరుగుతాయి.
ఈ అధ్యయనంలో కొందరి నిద్ర వేళలు, శరీరంలో కొవ్వు విస్తరణ, మధుమేహం వ్యాప్తిని విశ్లేషించారు.
ఆలస్యంగా పడుకునేవారిలో సగటున ప్రతి మీటరుకు 0.7 కిలోల బీఎంఐ, నడుం చుట్టుకొలత 1.9 సెం.మీ, కాలేయంలో కొవ్వు 14% అధికంగా ఉంటున్నట్టు తేల్చారు.
ఇవన్నీ మధుమేహం ముప్పు పెరిగేలా చేసేవే.
రాత్రిపూట సినిమాలు, ఓటీటీ, సామాజిక మాధ్యమాలు ఫాలో కాకుండా త్వరగా పడుకోండి.