దక్షిణ ఇటలీ లోని పుగ్లియాలోని గ్రామం ప్రెసిక్సే. ఇది నిజంగా ఒక అందమైన ప్రదేశం

ఈ గ్రామానికి వెళ్లి సెటిలైతే మీకు పాతిక లక్షల రూపాయలు ఇస్తారు అక్కడి స్థానిక అధికారులు

ఇలా పౌరులను రమ్మని అడగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అక్కడ?

ఈ గ్రామంలో మౌలిక వసతులు తక్కువ. ఏది కావాలన్నా చాలా దూరం వెళ్లి కొని తెచ్చుకోవాలి

అక్కడికి వెళ్లి ఇల్లు కొనుక్కుని ఉన్నా ఏదైనా వ్యాపారం చేసుకుని బతకాలి తప్ప ఉద్యోగాలు అయితే రావడం కష్టం

కేవలం ప్రెసిక్సే గ్రామమే కాదు, ఇటలీలోని ఎన్నో అందమైన గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.

ఎవరైనా విదేశీయులు వచ్చి నివసించేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి ఇటలీ అధికార వర్గాలు

జీవనోపాధి కల్పిస్తే ఎంతో మంది ప్రజలు తిరిగి గ్రామాలకు వెళ్తే అవకాశం ఉంది.

ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా అక్కడికే వెళ్లి స్థిర పడాలి అనుకుంటే మాత్రం మీకు 25లక్షలు గ్యారెంటీ

కానీ.. మళ్లీ అక్కడ డబ్బులు తీసుకున్న తరువాత కాదు కూడదంటే కుదరదండోయ్