అందమైన పర్యాటక కేంద్రంలో అస్థిపంజరాల సరస్సు ఒకటి
దేశంలో సమాధానం లేని మిస్టరీల్లో రూప్కుండ ఒకటి.
ఉత్తరాఖండ్ లో ఉన్న ఓ మంచు సరస్సు..
హిమాలయ పర్వతాలపై 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సుకు అస్థిపంజరాల సరస్సు అని పేరుంది.
1942లో రేంజర్ గా పనిచేస్తున్న హెచ్.కె. మధ్వాల్ అనే ఉద్యోగి ఈ సరస్సు అంచున కొన్ని అల పడి ఉండటాన్ని గుర్తించాడు.
మరిన్ని అస్థిపంజరాలున్నట్లు డౌట్ రావడంతో తవ్వడం ప్రారంభించారు. తవ్విన కొద్దీ అస్థిపంజరాలు బయటపడుతూనే ఉన్నాయి.
మొత్తం 500 మంది అస్థిపంజరాలు బయటికి వచ్చాయి.
ఇంతకీ ఆ ఆస్థిపంజరాలు ఎవరివి? అంతమంది అక్కడ ఎలా చనిపోయారు? అంత ఎత్తులోకి ఎలా వెళ్లారు? అనేది మిస్టరీ.
ఇది ఛేదించేందుకు యూరోపియన్ శాస్త్రజ్ఞుల బృందంతో ఆక్స్ఫోర్డ్ యూనివర్శిటీ, భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
కొన్నేళ్లుగా పడుతున్న వారి శ్రమకు ఇప్పటివరకూ సరైన సమాధానం దొరకలేదు. ఈ సరస్సు ఇప్పటికీ మిస్టరీనే..