‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్(HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. వీడియోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి.
చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్‌గా కొట్టిపారేస్తోంది.
ఈ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకుందాం.. కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి.
దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.
ఇది ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను కూడా కలిగించే అవకాశం ఉందట.
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.
ఇన్‌ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.