వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. సీజనల్ పండ్లు, కూరగాయల ద్వారా మన శరీరంలో తగినంత హైడ్రేషన్ లభిస్తుంది.
పుచ్చకాయ వంటి పండ్లు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ప్రతిరోజూ పుచ్చకాయ తినడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. వేసవి లో పుచ్చకాయకు డిమాండ్ ఎక్కువ.
పుచ్చకాయ అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు రోజువారీ వినియోగానికి అనువైనవి.
ప్రతిరోజూ ఫిట్‌గా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఇందులో పుచ్చకాయ ఉండేలా చూసుకోండి.
పుచ్చకాయ మన శరీరానికే కాదు మన చర్మాన్ని మృదువుగా, దృఢంగా మార్చుతుంది.
100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సాయం చేస్తుంది.
పుచ్చకాయలోని లైకోపీన్ కంటెంట్ గుండెకు మంచింది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది
పుచ్చకాయలోని సిట్రులిన్ కంటెంట్ శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పిని నివారిస్తుంది.
పుచ్చకాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.