పొట్టిగా ఉండే ప్రతీ ఒక్క అమ్మాయి పొడవుగా కనిపించాలనుకుంటుంది.
దాని కోసం ఎక్కువగా హైహీల్స్ ను వాడుతారు.
ఈ రోజుల్లో ఒక్కో రకం దుస్తులకు.. ఒక్కోరకం చెప్పులను యువతులు వాడుతున్నారు
ముఖ్యంగా చీరలు, లంగాఓణీలు, గాగ్రాలకు హీల్స్ ఎక్కువగా వాడతారు.
ఎప్పుడో ఒకసారి వాడితే ఏం కాదు. కానీ వాటితోనే ఎక్కువగా నడిస్తే, ఎన్నో నష్టాలు ఉన్నాయి.
ఐదు సెం.మీ కంటే తక్కువ ఉండే హైహీల్స్లను వాడితే అవేంటో జెస్ట్ రీడ్.
హైహీల్స్ వేసుకుంటే, మోకాళ్లు వంగి, మోకాళ్లలో మృదిలాస్థి అరిగిపోతుంది.
దీనివల్ల మోకాళ్ల నొప్పి, ఆస్ట్రియో ఆరిత్రోసైట్ వస్తుంది.
శరీరం మొత్తం బరువు పాదాలపైన పడి కాళ్ల చీలమండ, కీళ్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
కండరాలతో పాటు నడుము నొప్పి బాధిస్తుంది.