వానలు మొదలయ్యాయి. అక్కడక్కడా వరదలు ఈ సీజన్‌లో అందరూ చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు.
మనం జీర్ణ వ్యవస్థనూ పట్టించుకుంటారు. కానీ చెవిని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. వర్షరుతువులో ఫంగల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ.
తేమ కారణంగా ఆ సూక్ష్మజీవులు చెవిని చుట్టుముడతాయి. అపరిశుభ్రమైన లోపలి భాగం, నాణ్యతలేని ఇయర్‌బడ్స్ కూడా సమస్యకు కారణం అవుతాయి.
నొప్పి, దురద, దుర్వాసనతో కూడిన స్రావాలు, చెవిచుట్టూ వాపు.. మొదలైన లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
చెవులను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. తలస్నానం తర్వాత కాటన్ వస్త్రంతో తుడుచుకోవాలి.
ఇయర్‌బడ్స్ చెవిలో పెట్టుకునే అలవాటు అనారోగ్యకరం. మరీ చల్లని, మరీ పుల్లని పానీయాలు సేవించకూడదు. వర్షంలో బయటికి వెళ్లకపోవడమే మంచిది. వెళ్లినా గొడుగు తీసుకెళ్లాలి.
ఇతరుల ఇయర్ ఫోన్స్ ఉపయోగించవద్దు. దీనివల్ల హానికర క్రిములు ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి.
చెవిపోటు, చెవినొప్పి.. తదితర లక్షణాలు కనిపించగానే నిపుణులను సంప్రదించాలి. సొంతవైద్యం పనికిరాదు.