పొడి పెదవుల వెనుక డీహైడ్రేషన్ సమస్య కారణమై ఉంటుంది. అప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. 

డ్రై స్కిన్ సమస్యను దూరం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు పెదవులపై దేశీ నెయ్యి లేదా క్రీమ్ రాసుకోవాలి. 

మీరు కొబ్బరి నూనెతో మీ పెదాలను మసాజ్ చేస్తే పొడి చర్మం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలోవెరా జెల్ వాడకంతో పెదవుల పొడి చర్మం సమస్యను అధిగమించవచ్చు. 

 ఒక స్పూన్ బాదం నూనెలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పెదవులపై రుద్దాలి. దీనివల్ల పెదవులు మృదువుగా మారతాయి. 

ఆలివ్ నూనెలో కొద్దిగా పంచదార కలిపి పెదవులపై సున్నితంగా మర్దన చేయాలి. పెదవులకు తేమ అందుతుంది. 

బాదం నూనె, కొబ్బరి నూనె సమానంగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేస్తే పెదవులు తేమను కోల్పోవు.

గుప్పెడు గులాబీ రేకులను పాలలో నానబెట్టి మెత్తగా నూరి పెదాలకు రుద్దితే  పగలకుండా మృదువుగా ఉంటాయి.

టొమాటో గుండ్రని ముక్కని తీసుకుని దానిపై తేనె వేసి పెదవులపై 5 నిమిషాలు రుద్దాలి. తర్వాత నీళ్లతో కడిగి తేడాను చూడండి.  

ఒకసారి వాడిన గ్రీన్ టీ బ్యాగ్‌ని పడేయకుండా పెదవులపైన కొద్దిసేపు ఉంచాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పెదాలు తేమగా ఉంటాయి.