బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గోల్డ్‌ను ఇష్టపడే చాలా మంది స్వచ్ఛమైన బంగారం, నకిలీ బంగారం మధ్య తేడా గుర్తించలేక మోసాలకు గురవుతున్నారు. 

బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు సులభమైన పద్ధతులతో నిజమైన, నకిలీ బంగారాన్ని గుర్తించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. 

పసుపు రంగులో కనిపించే ప్రతిదీ కూడా బంగారం కాదు. అయితే అసలు బంగారాన్ని, నకిలీ బంగారాన్ని గుర్తించడం చాలా సులభం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

బంగారు ఆభరణాలను కొన్నప్పుడు హాల్‌మార్క్‌ను తనిఖీ చేయడం మర్చిపోవద్దు. వాస్తవానికి, బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ధృవీకరణ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేస్తుంది. 

బంగారంపై ఉండే ఈ హాల్‌మార్క్ చిహ్నం నిజమైన బంగారానికి గుర్తింపు. 

నిజమైన బంగారాన్ని గుర్తించడానికి నైట్రిక్ యాసిడ్‌ని కూడా వినియోగించవచ్చు. బంగారంపై నైట్రిక్‌ యాసిడ్ వేయగా బంగారం కలర్ మారకపోతే అది నిజమైనదని నిర్ధారించుకోవచ్చు. 

వైట్‌ వెనిగర్‌ను వినియోగించి స్వచ్ఛమైన బంగారాన్ని గుర్తించవచ్చు. ఆభరణాలపై వెనిగర్ వేస్తే రంగు మారకపోతే అది నిజమైన బంగారమని తెలుసుకోండి. 

నిజమైన బంగారాన్ని గుర్తించడానికి ఫ్లోటింగ్ టెస్ట్ చేయవచ్చు. బంగారాన్ని నీటిలో వేస్తే నిజమైన బంగారం వెంటనే నీటిలో మునిగిపోతుంది. నకిలీ అయితే తక్కువ బరువు కారణంగా తేలుతుంది. 

అయస్కాంతం సహాయంతో నిజమైన బంగారాన్ని గుర్తించవచ్చు. స్వచ్ఛమైన బంగారంలో అయస్కాంత మూలకాలు ఉండవు. కాబట్టి ఎలాంటి ప్రభావం ఉండదు. నకిలీ అయితే మాగ్నెట్ వైపు ఆకర్షింపబడుతాయి.