ప్రతి వంద మందిలో కనీసం 10-15 మందికి శరీరంపై పులిపిర్లు కనిపిస్తుంటాయి. 

పులిపుర్లు వైరస్ కారణంగా వస్తాయి. 

 వీటిని తొలగించడానికి స్క్రీపింగ్, బర్నింగ్, కటింగ్, ఫ్రీజింగ్ వంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. 

ఈ పద్ధతులు పులిపిర్లు మళ్లీ రావడాన్నీ నివారించలేవు. పులిపిర్లను తొలగించేందుకు ఆయుర్వేదంలో చికిత్స ఉంది.

వెల్లుల్లి రేకలను పులిపిరులపైన రుద్దితే ఇందులోని యాంటీ వైరల్ గుణం పులిపిరులు తగ్గుతాయి. ఇలా రెండు మూడు వారాలపాటు చేయాలి.

ఉల్లిపాయను సగానికి కోసి మధ్య భాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంత టైంకు ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీన్ని తీసి రోజూ కొంచెం పులిపిర్లపై ఉంచాలి.

Fill in some text

ఒక చుక్క ఆముదాన్ని పులిపిర్ల పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా, 3 వారాలు అప్లై చేస్తే ఫలితాన్ని మీరే చూస్తారు.