భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.
మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ ఓ నివేదిక తెలిపింది.
వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే.
మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కాళ్లవాపు బాగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లే.
కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
తరచుగా వికారం రావడం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి.
కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్ పడుతుంది.
అలసట, మెదడుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని వెల్లడిస్తున్నారు.
కిడ్నీలు ఉండే భాగంలో నొప్పి వస్తుంటుంది. నొప్పితో పాటు కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది.
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది.
ఇది కిడ్నీలు సరిగా పని చేయడం లేదనడానికి సంకేతంగా భావించాలి.
వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.