ప్రస్తుతం లివిన్ రిలేషన్షిప్ ట్రెండ్ గా మారింది.

కొన్ని సంవత్సరాలుగా విదేశీ యువత ఈ పద్ధతికి అలవాటుపడ్డారు. కానీ, ప్రస్తుతం మనదేశంలో కూడా ఇది బాగా ట్రెండ్ అయింది. 

కొంతమంది వివాహబంధంపై నమ్మకం లేకనో, మరి ఏ ఇతర కారణాలతోనో పెళ్లికాని వారు ఎక్కువగా సహజీవనం వైపు మొగ్గు చూపిస్తున్నారు. 

పెళ్లి చేసుకునే వాళ్లు పెళ్లికి ముందు ఒకరినొకరు అర్ధం చేసుకోవటానికి సహజీవన ప్రయోగాలు చేస్తున్నారు.

సహజీవనంలో ఎవరికి వారు, వారికి నచ్చినట్లు ఉండవచ్చు. అభిప్రాయ బేధాలతో మనస్పర్ధలు వస్తే బ్రేకప్ చెప్పేయచ్చని కొంతమంది అభిప్రాయం.

ఇలా సక్సెస్ కంటే ఫెయిల్ అయినా రిలేషన్స్ ఎక్కువ. లివిన్ రిలేషన్ పేరిట కొంతమంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 

శారీరకంగా కలవడానికా? జీవితాంతం కలిసి ఉండటానికా? ఎదుటివారు లివిన్ రిలేషన్ షిప్ లో ఏం ఆశిస్తున్నారో. తెలుసుకోండి. 

అలాగే లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు, ఇద్దరి అంగీకారంతో పుట్టే పిల్లలు.. ఆ తర్వాత ఎవరి వద్ద ఉండాలి. 

ఎలా చదివించాలి, అవసరాలు ఎవరు తీర్చాలనే విషయాలపై ముందే అవగాహన ఉండాలి.

ఇవన్నీ అవగాహన లేకుండా లివిన్‌ లో ఉండటమంటే కష్టమే.. ఒక్కసారి ఆలోచండి

సో.. అబ్బాయిలూ.. అమ్మాయిలూ.. బీకేర్‌ఫుల్‌! "డామిట్‌ కథ అడ్డం తిరిగి"తే ఇక అంతే..