పొద్దున లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.
నిమ్మకాయ నీరు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఆహారం అరుగుదలకు చక్కగా తోడ్పడుతుంది.
ఇందులోని సిట్రిక్ యాసిడ్ శరీరానికి హాని చేసే టాక్సిన్లను, అదనంగా ఉన్న నీటి శాతాన్ని బయటకు పంపిస్తుంది.
నిమ్మకాయలోని విటమిన్-సీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరిచి మృదువైన, మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.
నిమ్మకాయ నీటిని రెగ్యులర్గా తాగడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటాం.
నిమ్మకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడి, మంట, వాపు లాంటి సమస్యల నుంచి పోరాడే శక్తనిస్తాయి.
నిమ్మరసం తాగితే శరీరం బరువు కూడా తగ్గుతుంది.
నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలతో నిండి ఉంటుంది.