ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి
టీలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తాగినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి
బెడ్ టీ తీసుకోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
పరిగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి ఇతర వ్యాధులు పుట్టి క్రమంగా అవి పెద్ద వ్యాధిగా రూపాంతరం చెందుతాయి
పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా షుగర్ లెవల్స్ ను పెంచుతుందని తెలిపిన నిపుణులు
బ్రష్ చేసిన తర్వాత ఖాళీ కడుపుతో టీ తాగడం లేదా బెడ్ టీ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం మరింత క్షీణిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ క్షీణించే అవకాశం ఉంది
టీ ఎక్కువగా తాగితే నిద్ర సమస్యలు వస్తాయి. బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, రక్తపోటు సమస్యలు కూడా పెరుగుతాయి
పరగడుపున టీ తాగడం వల్ల వచ్చే వ్యాధులను దూరం చేసుకోవాలంటే ఆహారం తిన్న ఒకటి లేదా రెండు గంటల తర్వాత టీ తాగడం మంచిది
టీ తాగాల్సి వచ్చినప్పుడల్లా దానితో అల్పాహారం లేదా బిస్కెట్ ను తినండి. దీనివల్ల డీహైడ్రేషన్, కడుపునొప్పి, ఎసిడిటీ తగ్గుతాయి