ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. ఆ వ్యసనాన్నివదిలించుకోలేరు చాలామంది. కారణం పొగాకులోని నికోటిన్. ఈ పదార్థం మెదడును బానిసను చేసుకోగలదు.
సిగరెట్ల కారణంగా ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీని కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు
దేశంలో ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది సిగరెట్ తాగడం వల్ల చనిపోతున్నారని భారత ప్రభుత్వం చెబుతోంది.
సిగరెట్ తాగడం క్రమంగా పురుషుల్లోని వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
మహిళలు సిగరెట్లు తాగితే వారు గర్భం ధరించడానికి కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెపుతున్నారు.
ఓ పరిశోధన ప్రకారం, సిగరెట్లు తాగేవారికి నపుంసకత్వం వచ్చే అవకాశం 85 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
వీటితో పాటు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట.
సిగరెట్లు తాగే వ్యక్తిలో కొన్ని మార్పులు ఉన్నాయని, శరీరం చెడు ప్రభావాన్ని చూపడం ప్రారంభించిందని వైద్యులు చెప్పారు.