జుట్టు రాలుతోందా..
ఈ చిట్కాలు పాటిస్తే సరి!
విటమిన్ ఈ ఎక్కువగా ఉండే నువ్వులనూనెను తలకు పట్టించి, కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి
మందార పువ్వులను, కొబ్బరినూనెలో వేసి కాచాలి. ఆ నూనెను జుట్టుకి పట్టించి, గంట తర్వాత కుంకుడు రసంతో స్నానం చేయాలి
మందార ఆకులను మెత్తగా నూరి, తలకు బాగా పట్టించాలి. కాసేపు తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి
ఉసిరి రసం తీసి, తలకు బాగారాసుకోవాలి. ఇలా చేస్తే.. వెంట్రుకలు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతాయి
దోస గింజలు ఎండబెట్టి, దంచి.. దాన్నుంచి నూనె తీయాలి. అందులో నిమ్మరసం కలిపి.. తలకు రాసుకోవాలి
చేమ దుంపల రసం తీసి తలకు రాస్తే జుట్టు ఊడటం ఆగిపోతుంది
4 టీ స్పూన్ల కొబ్బరి పాలలో, 1 స్పూను నిమ్మరసం కలిపి, తలకు బాగా పట్టించాలి. కాసేపయ్యాక తలస్నానం చేయాలి
అలోవెరా ఆకుల్ని గుజ్జుగా చేసి, ఆ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లకు, స్కాల్ప్‌కి పెడితే.. మంచి ఫలితం దక్కుతుంది
2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని జుట్టుకి పట్టిస్తే.. జుట్టు రాలదు