కాఫీ పొడిని నీటిలో బాగా మరిగించిన తర్వాత చల్లార్చాలి. అనంతరం జుట్టుకి పట్టించి, 45 నిమిషాల తర్వాత కడగాలి
ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసుకొని.. అందులో ఉసిరి, మెంతిపొడులు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాగబెట్టి, జుట్టుకు రాసుకోవాలి
క్యారెట్ జ్యూస్‌లో కొంచెం నువ్వుల నూనె, మెంతి పోసి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి, తలస్నానం చేయాలి
బాగా నానబెట్టిన మెంతుల్ని మరిగించి, కరివేపాకు వేసి.. పేస్ట్‌లా చేయాలి. దాన్ని జుట్టుకి పట్టించి, అరగంట తర్వాత స్నానం చేయాలి
గోరింటాకు పొడిని పేస్ట్‌లా జుట్టుకి పట్టించి, కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేస్తే, మంచి ఫలితం ఉంటుంది
కొంచెం ఉసిరి పొడిలో కొబ్బరి నూనె కలిపి.. ఆ మిశ్రమాన్ని బాగా వేడి చేసి చల్లార్చాలి. దాన్ని జుట్టుకి రాసుకొని, అరగంట తర్వాత స్నానం చేయాలి
బాదం నూనెలో నువ్వులపొడి వేసి.. తరచూ తలకు రాసుకోవాలి. ఇలా చేస్తే.. జుట్టు త్వరగా నల్లగా మారుతుంది