టొమాటోలను గుజ్జులా చేసుకొని.. ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని, ఆ తర్వాత కడిగేయాలి
నిద్రపోవడానికి ముందు నిమ్మకాయ రసాన్ని కాటన్ క్లాత్‌తో ముఖానికి పట్టించాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు, నీళ్లు కలుపుకోవాలి
ఓట్స్‌లో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్, పెరుగు వేసి.. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించాలి. ఆరిపోయాక కడిగేయాలి
గుడ్డులోని పచ్చసొనలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి.. చర్మంపై అప్లై చేయాలి, ఆపై నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి
తేనెలో కొద్దిగా నిమ్మరసం వేసి.. చర్మంపై అప్లై చేయాలి. మసాజ్ చేశాక, గోరువెచ్చని నీటితో కడగాలి
కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి.. కాటన్ క్లాత్‌తో ఆ మిశ్రమాన్ని అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి
రోజ్ వాటర్‌లో ముల్తానీ మిట్టిని మిక్స్ చేసి.. ముఖానికి పట్టించాలి. పూర్తి పొడిగా అవ్వకముందే, నీటితో ముఖాన్ని స్క్రబ్ చేయాలి
గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి.. ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి
నిమ్మకాయను సగానికి కోసి, ఒక ముక్కపై చక్కెర వేయాలి. దాన్ని ముఖంపై మృదువుగా స్క్రబ్ చేయాలి. ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి