ఐస్ క్యూబ్స్ మొటిమలు ఉన్న చోట 10 సెకన్ల చొప్పున పెడుతుండాలి

మొటిమలు ఉన్న ప్రాంతంలో రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని చిదిమి రాయాలి

ఓ ఆపిల్ స్లైస్‌ని తీసుకుని ముఖంపై బాగా రబ్ చేయాలి

బియ్యంపిండిలో కొంత పెరుగు కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని, ఆరాక నీటితో కడగాలి

వేరుశనగ నూనె, నిమ్మరసం కలిపి.. ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి

ఓ కాటన్ ప్యాడ్‌లో ఆపిల్ సిడర్ వెనిగర్‌ని వేసి.. మొటిమలు ఉన్న చుట్టు రుద్దాలి

ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి, ముఖానికి బాగా రాసుకోవాలి

వేప ఆకుల్ని పేస్ట్ చేసి, పసుపు, నిమ్మరసం కలిపి.. ముఖానికి అప్లై చేయాలి, తర్వాత కడిగేయాలి

టమోటాని సగానికి కట్ చేసి, దానిపై ఉప్పు మల్లి, మొటిమలపై రుద్దాలి

అరటిపండు గుజ్జులో శెనగపిండి కలిపి, ముఖానికి రాసుకొని, ఆరిన తర్వాత కడిగేయాలి