కాలేయంలో అధిక కొవ్వు సమస్య చికిత్సకు ఉసిరి ఒక ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి.

ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాలేయం నుండి వ్యర్ధాలను తొలగించడంలో, మరింత నష్టం జరగకుండా రక్షించడంలో సహాయపడుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ ఫ్యాటీ లివర్ నయం చేయడానికి ఒక సహజమైన నివారణ.

ఆపిల్ సైడర్ వెనిగర్ కాలేయ సాధారణ విధులకు ఆటంకం కలిగించే హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపడానికి తోడ్పడుతుంది.

పసుపులో ఉండే కర్కుమిన్  నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) నుండి కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

దాల్చినచెక్కలో బలమైన శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇవి కాలేయంలో మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా తోడ్పడతాయి.

నిమ్మరసం విటమిన్ సి యొక్క పవర్‌హౌస్‌. కాలేయ కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నివారించి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది.

నిమ్మకాయ సహజ హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలు లిపిడ్ ప్రొఫైల్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఆల్కహాలిక్-ప్రేరిత కొవ్వు కాలేయంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.

గ్రీన్ టీ  లో పుష్కలమైన కాటెచిన్‌లు ఉన్నాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరిచి కొవ్వు పెరగకుండా నిరోధించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగిఉంది.

కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వు మొత్తాన్ని గ్రీన్ టీ నిరోధిస్తుంది. కొవ్వును కరిగించి జీవక్రియను ప్రేరేపిస్తుంది.