వాతావరణంలో వచ్చే మార్పులతో జలుబు, దగ్గులాంటి సమస్యల బారిన అందరూ పడుతుంటారు. కొన్ని వంటింటి చిట్కాలు ఎంతో బాగా పని చేస్తాయి.
వంటింటిలోని కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టుకోవడం వంటి వాటి వల్ల వెంటనే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేమిటో చూద్దాం.
ఒక టీస్పూన్ పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు తులసి టీ తాగాలి.
ఉసిరి, పైనాపిల్, నిమ్మ, కివీ మొదలైన పుల్లటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచింది.
ఒక లీటరు నీటిలో ఏడు ఎనిమిది తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్ చొప్పున వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి మరిగించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగండి.
స్నానం చేసేందుకు, తాగేందుకు చల్లటి నీరును ఉపయోగించకండి. జీర్ణక్రియ మెరుగయ్యేందుకు ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగండి.
గొంతు సమస్యలుంటే తేనె మంచి ఉపశమనమిస్తుంది. కాబట్టి తేనేను తీసుకుంటూ ఉండండి.
సాధారణ టీ, కాఫీలకు బదులు అల్లం, పసుపు, లెమన్టీలు తాగితే చాలా మంచిది.
గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే దగ్గు, జలుబు నుంచి వెంటనే బయటపడే అవకాశం ఉంటుంది.
గొంతునొప్పి మరీ ఎక్కువగా వేధిస్తుంటే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్ చేయండి. తులసి ఆకులు నమలాలి.