వర్షాకాలంలో అంటువ్యాధులు విజృంభిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రమాదం తప్పదు.

రోగాల నుంచి శరీరం తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. 

వర్షాకాలంలో ఎక్కువగా కూరగాయలు తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా చేదుగా ఉండే కూరగాయల్ని తినటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. 

వర్షాకాలంలో రోగాలు రావటానికి ప్రధాన కారణం నీరు. అందుకే.. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. అది కూడా గోరు వెచ్చగా ఉన్న నీటిని తీసుకోవటం ఉత్తమం.

వర్షాకాలంలో పాల ఉత్పత్తులను కూడా తగినంతగా తీసుకోవాలి. పాలు అజీర్తిని కలుగజేస్తాయి కాబట్టి.. యోగార్ట్‌, కాటేజ్‌ చీజ్‌, బట్టర్‌ మిల్క్‌ వంటివి తీసుకోవాలి.

వర్షాకాలంలోనే కాదు.. ఏ కాలంలోనైనా పండ్లను తినటం మంచిదే. కానీ, వర్షాకాలంలో కొన్ని పండ్లను తినకపోవటం కొంత మేలు చేస్తుంది. ముఖ్యంగా పుచ్చకాయను తినటం ఆపాలి.

వర్షాకాలంలో కడుపుపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే ఏవి పడితే అవి తినటం మానాలి. ముఖ్యంగా మసాలాలకు దూరంగా ఉండాలి.

వర్షాల్లో తడవటం అంత మంచిది కాదు. బయటకు వెళ్లే టప్పుడు వర్షం పడుతున్నా లేకపోయినా.. గొడుగును క్యారీ చేయాలి.

 దోమల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దోమ కాయిల్స్‌, ఆల్‌ ఔట్‌ వంటివి వాడాలి.