బరువు తగ్గడం కోసం చాలామంది ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ జ్యూసెస్. రెగ్యులర్‌గా వీటిని తాగితే చాలు, వేగంగా బరువు తగ్గొచ్చు. ఈ రసాల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి, కేలరీలను బర్న్ చేస్తాయి.

కీరకాయ రసం: ఈ రసంలో తక్కువ కేలరీలు, ప్రొటీన్లు, విటమిన్ సీ - కే, మెగ్నీషియం ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీవక్రియను పెంచుతుంది. ఆహారాల కోరికల్ని నియంత్రించి, శరీరానికి తగిన పోషకాల్ని అందిస్తుంది.

కాకరకాయ రసం: ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటిమన్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తక్కువ సమయంలో చాలా కొవ్వును కరిగించేస్తుంది.

నారింజ రసం: ఇందులో ఏ, సీ విటమిన్స్‌తో పాటు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీవక్రియను వేగవంతం చేస్తుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

దానిమ్మ రసం: ఇందులో ఫోలేట్, ఈ, కే విటమిన్స్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కంజుగేటెడ్ లినోలెనిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇది కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఆకలిని అరికడుతుంది.

పుచ్చకాయ రసం: ఇందులో అర్జినైన్ అనే అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రసం కండరాల నొప్పులను నివారించడంలోనూ సహకరిస్తుంది.

క్యారెట్ రసం: క్యారెట్‌లో కేలరీలు తక్కువగానూ, ఫైబర్ అధికంగానూ ఉంటాయి. ఇది కొవ్వును కరిగించడంలో, బరువును తగ్గడంలో తోడ్పడుతుంది. రోజూ ఈ జ్యూస్ తాగితే, ఆరోగ్యంగానూ ఉంటారు.

గూస్బెర్రీ రసం: ఇది జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఫలితంగా.. కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు అదుపులో ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగాలి.

క్యాబేజీ రసం: ఇది కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, వ్యర్థాలను వేగంగా తరలిస్తుంది. బరువుని వేగంగా తగ్గించే ప్రక్రియకు సహాయపడుతుంది.