పైనాపిల్.. ఇది పొట్టలోని కొవ్వుని తగ్గించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియనూ మెరుగు పరుస్తుంది

యాపిల్స్.. వీటిలో తగినంత ఫైబర్ ఉంటుంది. కేలరీలు, సహజ చక్కెర, కొవ్వుని పోగొట్టడంలో సహకరిస్తుంది

గుడ్లు.. వీటిల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఉదయాన్నే తింటే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది

దోసకాయ.. ఇందులో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వుని నియంత్రిస్తాయి

ఓట్స్.. ఫైబర్‌తో పాటు ఆరోగ్యకర కార్బోహైడ్రేట్ల ఉంటాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి

బీన్స్.. బరువుని తగ్గించడానికి దోహదపడే ప్రొటీన్స్, పోషకాలు వీటిల్లో అధికంగా ఉంటాయి

నారింజ & ద్రాక్ష.. వీటిల్లో కరిగే ఫైబర్స్, విటమిన్ సి ఉంటాయి. ఈ విటమిన్ శరీరంలోని ఐరన్‌ని గ్రహిస్తుంది

అరటి పండ్లు.. వీటిలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరానికి శక్తినిచ్చి, బరువుని నియంత్రిస్తాయి

బెర్రీ పండ్లు.. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాధి వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు బరువు తగ్గుతుంది

పుచ్చ పండ్లు.. ఈ పండ్లలో ఎక్కువగా నీటి శాతం, తక్కువ శాతంలో కేల‌రీస్ ఉంటాయి. కాబట్టి కొవ్వు శాతం బాగా తగ్గుతుంది