ఉదయాన్నే మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పప్పును తినటం చాలా మంచిది.

ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి కచ్చితంగా అలవాటుగా చేసుకోండి.

ప్రతి మనిషికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం.

ఉప్పు వినియోగం గణనీయంగా తగ్గాలి. వాడకానికి సముద్రపు ఉప్పు చాలా మంచిది.

టీ, కాఫీలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. రాగిజావ ఆరోగ్యానికి చాలా మంచిది.

బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తినవలసి వస్తే వాటిలో మనకు సౌలభ్యంగా ఉండేవాటిని ఎంచుకోవాలి.

సాధ్యమైనంత వరకు బయట తినటానికి నిరాకరించడమే మంచిది.

కూరగాయలను, పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలపాటు ఉంచండి.

 ఆ తరువాత ఆ నీటిని పారపోసి మరలా వాటిని కడిగి పెట్టుకోండి. మరొక సారి కడగటం వల్ల చాలా వరకు హానికరమైన రసాయనాలను తొలగించవచ్చు.

నీరు త్రాగటం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకు 5 లీటర్లు నీరు అయినా త్రాగాలి.

వీలైతే చల్లని నీరు కన్నా గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి అత్యంత మంచిది. ఉదయాన్నే ఒక లీటరు నీళ్ళు ఖచ్చితంగా త్రాగండి.