కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలి. పచ్చని ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ సి ఉన్న ఆహరాలు తరచుగా తీసుకుంటే, ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎందుకంటే, విటమిన్ సీ ఎముకల్లో ఏర్పడే కణాల్ని పెంచుతుంది.

విపరీతమైన డైటింగ్‌ను నివారించడం ఎంతో ఉత్తమం. తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటే, జీవక్రియను నెమ్మదిస్తుంది, ఇది ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది.

నిత్యం వ్యాయామం చేస్తే, ఎముకలు దృఢంగా ఉంటాయి. కాబట్టి, సమయానుసారంగా వ్యాయామం చేయడం బెటర్.

విటమిన్ డి కూడా ఎంతో అవసరం. రోజూ కొంతసేపు ఎండలో కూర్చుకోవాలి. అలాగే చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు తినాలి.

ఎముకలను పటిష్టంగా వుండేందుకు, తగినంత ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే.. ఎముకలు 50% ప్రోటీన్‌తోనే తయారవుతాయి.

మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ స్రవిస్తుంది. ఇది ఎముకల అభివృద్ధికి దారితీస్తుంది. కాబట్టి.. గాఢ నిద్ర కూడా అవసరం.

నువ్వులలో పాల కంటే అదనంగా 13 శాతం ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. కాబట్టి.. నువ్వులు తింటే, ఎముకలకి కావల్సిన కాల్షియం లభిస్తుంది.

జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్ వంటి డ్రై ఫ్రూట్స్ తరచూ తీసుకుంటే.. ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు చెప్తున్నారు.