ఒక్కొక్కరూ ఒక్కోలా నిద్రపోతుంటారు. కొందరు వెళుతురులోనే నిద్రపోతే.. మరికొంతమంది చికట్లోనే నిద్రపోతారు.

ఇక కొంతమంది చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకుని నిద్రపోతారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది టీవీలను, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లను చూస్తూ చూస్తూ అలాగే పడుకోవడం అలవాటైపోయింది.

పడుకునేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రాంణాంతక రోగాలొచ్చే అవకాశం ఉంది.

2019 అధ్యయనం ప్రకారం..బెడ్ రూంలో టీవీని ఆన్ చేసి పడుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయే అవకాశం ఉంది.

టీవీ, ల్యాప్ టాప్ ల నుంచి వెలువడే అధిక శక్తి బ్లూరే రెటీనాను దెబ్బతీస్తుంది, ఈ కాంతి ఎక్కువ సేపు కళ్లపై పడటం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది.

టీవీ, ల్యాప్ ల నుంచి వచ్చే నీలిరంగు కాంతి ప్రమాదకరమైన క్యాన్సర్ కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

రాత్రిపూట ఎక్కువసేపు ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉపయోగించే వ్యక్తులు ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది

అధిక శక్తి కలిగిన బ్లూ లైట్ వల్ల డిఎన్ఎ దెబ్బతింటుంది,  కణాలు, కణజాలాలు నాశనం కాకుండా చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది