శీతాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జలుబు, దగ్గు నుంచి ఆస్థమా వరకు అనేక సమస్యలకు ఇబ్బందులు పెడతాయి.

చర్మం ఎక్కువగా పొడిబారడం, పగుళ్లు ఏర్పడడం, విటమిన్ లోపాలు ఏర్పడతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. 

ప్రధానంగా ముక్కు దిబ్బడం, ఆయాసం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ముక్కులో నాజిల్ డ్రాప్స్ వేసుకోవాలి. 

ఆయాసం, దమ్ము వచ్చేవారు ఇన్ హెల్లర్స్ వాడాలి. గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల గొంతులో ఉన్న ఇన్​ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.

 ఇంకా ఉప్పు కలిపిన గోరు వెచ్చటి నీటిని పుకిలించాలి. ఇలా చేస్తే గొంతులో ఉన్న ఇన్​ఫెక్షన్లు బయటకు పోతాయి. 

వేడి నీటితో కాకుండా గోరు వెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలి.

స్నానం చేసిన 15 నిమిషాల తర్వాత లోషన్లు, మాయిశ్చరైజర్లు చర్మానికి పెట్టుకోవాలి.

బయటకు వెళ్లి వ్యాయామం చేయలేని వారు ఇంట్లోనే వాకింగ్, యోగా లాంటివి చేయాలి.

పాదాలు పొడిబారడం, పగుళ్లు ఏర్పడకుండా ఉండేందుకు గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలు వాటిని ఉంచాలి.

బయటకు వెళ్లే సమయంలో స్వెటర్లు, గ్లౌజులు, కోట్లు ధరించాలి.