యాసిడ్, చక్కెర పదార్థాలున్న డ్రింక్స్: దంతాలపైన పొరలో ఉండే ఎనామిల్ వల్లే దంతాలకు దృఢత్వం వస్తుంది. అయితే.. అతిగా చక్కెర, యాసిడ్ లక్షణాలున్న డ్రింక్స్ తీసుకుంటే.. ఆ పొర దెబ్బతింటుంది.

డైట్ సోడా: కొందరు చక్కెర లేకుండా ఉండే డైట్ సోడాలను తాగుతుంటారు. అయితే.. వీటిల్లోనూ యాసిడ్ పదార్థాలుంటాయని, దంతాలను దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తున్నారు.

పళ్ల రసాలు: పళ్ల రసాలు శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైనవి. కానీ.. నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ జాతి పళ్ల రసాల్లో యాసిడ్ లక్షణాలుంటాయి. వీటిని స్ట్రాతో తాగడం మంచిది.

ఎనర్జీ డ్రింక్స్: శరీరం అలసిపోయినప్పుడు తక్షణ శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే.. వీటిలో ఎక్కువ స్థాయిలో చక్కెరలు, కృత్రిమ రంగులు కలుపుతారు. అవి దంతాలకు హాని కలిగిస్తాయి.

టీ, కాఫీలు: టీ, కాఫీ వంటివి అతిగా తాగితే.. దీర్ఘకాలంలో దంతాలపై ఎనామిల్ దెబ్బతింటుంది. దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశమూ ఉంటుంది.

ఆల్కహాల్: వీటిని తీసుకుంటే.. నోటిలో చిగుళ్లు దెబ్బతిని, వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

బాటిల్ నీళ్లు: బాటిళ్లలో నింపి విక్రయించే మంచి నీళ్లలో చాలా వరకు స్వల్పంగా ఎసిడిటిక్ లక్షణాలుంటాయి. ఇవి దంతాలకు ప్రమాదకరమైనవి.